నేడు విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమం

NDL: స్వచ్ఛ ఆంధ్ర సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీశైలక్షేత్ర పరిధిలో గురువారం విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తొలుత గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు ర్యాలీ నిర్వహిస్తారు. పారిశుద్ధ్య నిర్వహణకు క్షేత్రాన్ని 6 జోన్లు, 11 సెక్టార్లుగా, 66 ప్రదేశాలుగా విభజించారు. దేవస్థానం సిబ్బంది కూడా ఈ విధులలో పాల్గొన్నారు.