తెలియని లింకులు ఓపెన్ చేయరాదు: ధారూర్ సీఐ

తెలియని లింకులు ఓపెన్ చేయరాదు: ధారూర్ సీఐ

VKB: మొబైల్ ఫోన్లకు వచ్చే తెలియని లింకులు ఓపెన్ చేయరాదని ధారూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రఘురాం సూచించారు. సైబర్ నేరగాళ్లు కొత్త రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారని, ఇప్పుడు లింకులు ఓపెన్ చేస్తే ఫోన్లు హ్యాక్ అయి మీ అకౌంట్‌లోని డబ్బులు కొట్టేస్తారని వివరించారు. వ్యక్తిగత సమాచారం అంతా సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.