'నిర్దిష్టమైన ఓటర్ల జాబితాను తయారు చేయాలి'
CTR: దోషాలు లేకుండా నిర్దిష్టమైన ఓటర్ల జాబితాను తయారు చేయాలని MRO రాము సూచించారు. శుక్రవారం పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డితో కలిసి BLOలు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ సూచనలను వివరిస్తూ, ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో వెళ్లి వివరాలను సేకరించాలని సూచించారు.