త్రాగు నీటి సరఫరా నిలిపివేత..!
SKLM: నరసన్నపేట మండలం మేజర్ పంచాయతీలో కుళాయిల ద్వారా అందించే త్రాగునీటి సరఫరాను నేటి నుంచి రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఈవో పి. ద్రాక్షాయిని తెలిపారు. దేవాది ప్రాంతంలోని బోర్లకు మరమ్మతులు జరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.