పల్లె నిద్ర చేసిన బొబ్బిలి సీఐ నారాయణరావు

పల్లె నిద్ర  చేసిన బొబ్బిలి సీఐ నారాయణరావు

VZM: బొబ్బిలి సీఐ కె. నారాయణరావు గురువారం రాత్రి స్థానిక అలజంగి గ్రామంలో పల్లెనిద్ర చేశారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని ఈ సందర్భంగా సూచించారు. రానున్న స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలన్నారు. గ్రామస్తులతో మమేకమైన ఆయన పోలీస్‌ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై కొండలరావు ఉన్నారు.