వృద్ద దంపతులకు అభయం సేవా సంఘం సాయం

వృద్ద దంపతులకు అభయం సేవా సంఘం సాయం

SKLM: నందిగాం మండలం పెంటూరు గ్రామంకి చెందిన గౌడు. కృష్ణారావు, ఎండమ్మ అనే వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతూ పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు కుర్మారావు ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అభయం సేవా సంఘం వాళ్ళు బుధవారం నెల రోజులకు సరిపడేలా 25కేజీల రైస్, నిత్యవసర వస్తువు , రూ.6000 ఆర్ధిక సాయం అందించారు.