డేటా సెంటర్‌పై TDP, YCP మధ్య క్రెడిట్ వార్
VSP: విశాఖలో ఏర్పాటయ్యే డేటా సెంటర్‌పై TDP, YCP మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. క్రెడిట్ తమదేనని రెండు పార్టీలు వాదిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్‌కు తమ హయాంలోనే ఒప్పందం జరిగిందని చెప్తున్నాయి. 2020 నవంబర్‌లో అగ్రిమెంట్, 2023 మేలో శంకుస్థాపన చేశామని మాజీ సీఎం జగన్ చెప్పడంపై TDP మండిపడింది. దీంతో ఈ డేటా సెంటర్ చర్చనీయాంశంగా మారింది.