VIDEO: లింగంపేటలో ఆక్రమణలు తొలగించిన అధికారులు
AKP: నాతవరం మండలం పరిధిలోని లింగంపేట గ్రామంలో సర్వే నం.46లోని 12 సెంట్ల గ్రామకంఠం భూమిపై ఉన్న ఆక్రమణలను శుక్రవారం పోలీసులు బందోబస్తు మధ్య తొలగించారు. తహశీల్దార్ చందన రేఖ, ఎస్ఐ వై.తారకేశ్వరరావు, ఎంపీడీఓ ఎం.ఎస్.శ్రీనివాస్ సమక్షంలో జేసీబీలతో షెడ్లు తొలగించి భూమికి మార్కింగ్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బలగాలు మోహరించారు.