ఎమ్మెల్యే నేతృత్వంలో వరద బాధితులకు సాయం

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి విజయవాడ వరద బాధితుల కోసం సహాయం అందించారు. వరద బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు, మందులు అందజేశారు. ఈ మేరకు శ్రీనివాసరావు పేటలోని క్యాంప్ కార్యాలయం నుంచి తన పిలుపు మేరకు వచ్చిన సామగ్రిని మంగళవారం విజయవాడకు పంపించారు.