ఆలయంలో చొరీకి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు

ఆలయంలో చొరీకి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు

JN: బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్ల గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ ముగ్గురు వ్యక్తులు గత నెల 29న ఆలయంలో చోరీకి పాల్పడి అమ్మవారి ముక్కుపుడకతో పాటు పలు వస్తువులను అపహరించారు. గుర్తించిన గ్రామస్తులు వారిని పట్టుకొని పోలీసులకు శనివారం అప్పగించారు. వారి పై కేసు నమోదైంది.