బీజేపీ రాష్ట్ర నేత లక్ష్మీ ప్రసన్నకు ఘన సత్కారం

బీజేపీ రాష్ట్ర నేత లక్ష్మీ ప్రసన్నకు ఘన సత్కారం

కోనసీమ: అయినవిల్లి మండలం కే.జగన్నాధపురంలో శనివారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్నను బీజేపీ సీనియర్ నాయకులు యనమదల రాజ్యలక్ష్మి తన నివాసంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా పార్టీ బలోపేతానికి మహిళా నేతలు విశేష కృషి చేయాలని లక్ష్మీ ప్రసన్న సూచించారు. ఈ కార్యక్రమంలో ఆకుమర్తి బేబీరాణి, యనమదల వెంకటరమణ పాల్గొన్నారు.