పైడిపాలెం రిజర్వాయర్ సమాచారం

KDP: గండికోట ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మితమైన పైడిపాలెం రిజర్వాయర్‌లో బుధవారం ఉదయం 4.78 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. రిజర్వాయర్లోకి గండికోట ఎత్తిపోతల పథకం నుంచి 300 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు పేర్కొన్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం 906.30 అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.