అన్నప్రసాద సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే
NZB: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని వినాయక నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామిని అర్భన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన హనుమాన్ దీక్ష స్వాముల అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్ష స్వాములకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి వారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా అనిపించిందని తెలిపారు.