ప్రత్యేక చొరవతో తుప్పలను తొలగించిన ఎస్సై
VZM: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎస్పీ ఆదేశాలతో గుర్ల పోలీసు స్టేషన్ ఎస్సై నారాయణరావు రోడ్డు పక్కన ఏపుగా పెరిగిన తుప్పలను జెసిబి సహాయంతో మంగళవారం తొలగించారు. తుప్పలు తొలగించడం వలన రోడ్డు ప్రమాదాలను అదుపులోకి తీసుకురావచ్చని ఆయన అన్నారు. దీంతో వాహనదారులు ప్రయాణం సుగుమం అవుతుందన్నారు.