బేలలో క్షుద్రపూజల కలకలం
ADB: బేల మండలంలోని సాగింది గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ZPHS పాఠశాల పక్కన రోడ్డుపై గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిమ్మకాయలు, కోడిగుడ్లతో క్షుద్రపూజలు చేశారని స్థానికులు తెలిపారు. ఆది చూసిన గ్రామస్థులంతా భయాందోళనకు గురవుతున్నారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.