శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వీధి నాటకం ముగింపు
RR: కొందుర్గు గ్రామంలో కొన్ని రోజులుగా భక్తిశ్రద్ధలతో ప్రదర్శిస్తున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వీధి నాటకం నిన్న విజయవంతంగా ముగిసింది. నాటకం చివరి రోజు కావడంతో గ్రామ నాయకులు, పాలకవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళాకారులను అభినందించారు. గ్రామస్తుల సందడి మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ ప్రదర్శనను వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.