ఎంపీటీసీల జీతాలు మంజూరు చేయాలి

SKLM: జి.సిగడాం మండలంలో గల 16మంది MPTC సభ్యులకు సంబంధించిన 23నెలల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం స్పందించి వెంటనే విడుదల చేయాలని MPP మీసాల వెంకటరమణ కోరారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం జడ్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌లో జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజుకు ఫిర్యాదు చేసి వినతిపత్రం అందజేశారు. వేతనాలు సమయానికి అందక ఇబ్బందులు పడుతున్నామని వెల్లడించారు.