తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని UDA ఛైర్మన్ ఆదేశాలు
CTR: గుడుపల్లె మండలం గుండ్లసాగరం పంచాయితీ పరిధిలోని గుండ్లసాగరం, గుత్తార్లపల్లి గ్రామాల్లో పీకేఎం–యూడీఏ ఛైర్మెన్ డా. బీఆర్ సురేష్ బాబు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.