ప్రధాన రహదారిపై మంచినీటి లీకేజీ
SRD: సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారిపై గత మూడు రోజులుగా మంజీర మంచినీటి పైప్ లైన్ లీకేజీ అవుతుంది. మంచినీళ్లు రోడ్డుపై పారుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు మళ్లీ పైప్ లైన్ లోకి చేరడంతో మురికి నీళ్లు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి లీకేజీకి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.