పొన్నూరులో ఇంటికి నిప్పంటించిన దుండగులు
గుంటూరు: పొన్నూరులోని 27వ వార్డులో శనివారం అర్ధరాత్రి కలకలం రేగింది. ఓ ఇంటికి గుర్తుతెలియని దుండగులు నిప్పంటించడంతో ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. బాధితుల ఫిర్యాదుతో ఆదివారం ఘటనా స్థలానికి చేరుకున్న అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.