కిరోసిన్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం
MDK: పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటలో ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. నారా నరేష్ (30) అనే వ్యక్తి తనపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పి అతన్ని రక్షించారు. అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా, ఈఎంటీ రామవ్వ, పైలట్ రఘు ఘటనాస్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.