రేపు జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు: DEO
VZM: శ్రీరామనవమి పండగ సందర్భంగా రేపు జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ DEO మాణిక్య్కం నాయుడు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని, అన్ని పాఠశాలల HMలు విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.