అనకాపల్లి జోన్ అభివృద్ధికి ప్రాధాన్యత

అనకాపల్లి జోన్ అభివృద్ధికి ప్రాధాన్యత

VSP: అనకాపల్లి జోన్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్ గార్గ్ తెలిపారు. విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రోడ్ల విస్తరణ, తాగునీటి సరఫరా మెరుగుదలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇందులో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.