శిలాఫలకంలో డిప్యూటీ సీఎం ఫొటో తొలగింపు

TPT: నారాయణవనం మండలం పాల మంగళం జడ్పీ ఉన్నత పాఠశాల గేటు పక్కన హాస్టల్ భవన ప్రారంభోత్సవానికి ఏప్రిల్ నెలలో శిలాఫలకం వేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శిలాఫలకంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఫొటోలను తొలగించారు. దీనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. శిలాఫలకంలోని ఫొటోలను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరుతున్నారు.