నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
NLR: నెల్లూరు పట్టణం రాజేంద్రనగర్ విద్యుత్ ఉపకేంద్ర పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ శ్రీధర్ తెలిపారు. చెట్ల కొమ్మలు తొలగింపు నేపథ్యంలో గుప్తాపార్కు, ములుమూడి బస్టాండ్, చిన్నబజార్, జ్ఞానమ్మతోట, సంతపేట, రామిరెడ్డి వీధి, తదితర ప్రాంతాల్లో ఈ అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు గమనించాలన్నారు.