'విద్యార్థులకు స్వెటర్ల పంపిణీ'
JN: జిల్లాలోని ఎస్సీ బాలికల వసతి గృహం, ఎస్సీ బాలుర వసతి గృహాలు (ఎ), (సి), మరియు ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహాల విద్యార్థులకు నిన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా స్వెటర్లను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి విక్రమ్ కుమార్ కూడా పాల్గొన్నారు.