విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్
NRPT: ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మరికల్ మండల కేంద్రంలోని మంగళవారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులతో ఆరా తీశారు. భోజనంపై సంతృప్తి వ్యక్తం చేశారు.