గురుకుల విద్యార్థినులతో పోలీసుల ఇష్టాగోష్టి..
MNCL: చెన్నూరు సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పట్టణ సీఐ సూచన మేరకు టౌన్ మహిళా కానిస్టేబుల్స్ సాహెరా, మనీషాలు పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించారు. ఇకపై వారానికి రెండు సార్లు మహిళా పోలీస్ సిబ్బంది పాఠశాలను సందర్శించి సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తామన్నారు. డ్రాయింగ్ కాంపిటిషన్‌లో పాల్గొన్న విద్యార్ధినులకు పెన్నులను బహుకరించారు.