'పింఛన్ సొమ్ముతో పేద కుటుంబాలకు ఆర్ధిక భరోసా'

NTR: మైలవరం నియోజకవర్గంలో 989 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు కాగా, వారికి ఈ నెలలో రూ.39,56,000లు సొమ్మును తాజాగా అందజేసినట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. పింఛన్ సొమ్ముతో పేద కుటుంబాలకు ఆర్ధిక భరోసా కలుగుతుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.