పరీక్ష హాల్లోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదు: కలెక్టర్

WNP: మార్చి 5 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను వనపర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ సహా ఏ ఒక్కరూ మొబైల్ ఫోన్లు తీసుకువెళ్ళడానికి అనుమతి లేదని చెప్పారు.