ఎ. కొండూరులో అక్రమ విద్యుత్ చౌర్యంపై భారీ జరిమానా

ఎ. కొండూరులో అక్రమ విద్యుత్ చౌర్యంపై భారీ జరిమానా

NTR: ఎ.కొండూరు మండలం కంభంపాడు సెక్షన్ పరిధిలో బుధవారం విజిలెన్స్ అధికారులు 40 బృందాలుగా ఏర్పడి ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 2614 విద్యుత్ సర్వీసులను తనిఖీ చేయగా అక్రమంగా వినియోగిస్తున్న 6 సర్వీసులకు రూ. 95,000 జరిమానా విధించారు. అలాగే 138 మంది వినియోగదారులు అదనపు లోడ్ వినియోగిస్తున్నట్టు గుర్తించి రూ.3,08,200 ఆపరాధ రుసుము విధించారు.