'డ్రైయిన్లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి'
గుంటూరు జిల్లాలోని ఓల్డ్ క్లబ్ రోడ్డు, బస్టాండ్, నెహ్రూనగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు లోపాలకు తావులేకుండా చూడాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధాన కాలువల్లో పూడికతీత పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో డ్రైయిన్లపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలన్నారు.