బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి: MLA
ADB: బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే బజార్‌హత్నూర్ అభివృద్ధి చెందుతుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పర్చ సాయన్నకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. సౌమ్యుడు సర్పంచ్ అయితే అందరికి మంచిదని, అందరిని గౌరవించే సాయన్నను గెలిపించాలని కోరారు.