బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా కేతపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామంలో గల శ్రీ శ్రీ పచ్చల పార్వతి సోమేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘనంగా ఆవిష్కరించారు. ఈ నెల 15, 16, 17 తేదీలలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలలో స్థానికులు, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో విజయవంతం చేయాలని కోరారు.