'క్రీడలతో మానసిక ఉల్లాసం శరీర దృఢత్వం'
KNR: పోలీస్ VS ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆదివారం చొప్పదండిలో నిర్వహించారు. స్థానిక జడ్పీ హై స్కూల్ మైదానంలో ఎస్సై నరేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ నిర్వహించగా సీఐ ప్రదీప్ కుమార్ ప్రారంభించారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో మానసిక ప్రశాంత కలుగుతుందని సీఐ తెలిపారు. విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.