పెద్దహరివాణంలో 12ఏళ్లకోసారి భక్తి మహోత్సవం

KRNL: ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో 12ఏళ్లకోసారి నిర్వహించే శ్రీగర్జలింగేశ్వరస్వామి 5వ భండార మహోత్సవం వైభవంగా జరిగింది. సోమవారం ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొని, స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి, శాలువాలు, పూలమాలతో సత్కరించారు.