VIDEO: రేషన్ షాపులకు పోటెత్తిన లబ్ధిదారులు
SRD: కంగ్టి మండలం తడ్కల్‌లో రేషన్ బియ్యం పంపిణీ వద్ద రద్దీ నెలకొంది. ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల కోటాను విడుదల చేయడంతో లబ్ధిదారులు భారీగా తరలివచ్చారు. గోదాముల నుంచి సరైన సమయానికి బియ్యం సరఫరా కాకపోవడంతో పంపిణీలో జాప్యం జరుగుతోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పందించిన డీలర్లు, ఈ నెల చివరి వరకు బియ్యం అందజేస్తామని, లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని కోరుతున్నారు.