'కాలువలపై ఉన్న ఆక్రమణలు తొలగించాలి'
PPM: పట్టణ ప్రాంతాల్లో మురుగు కాలువలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని కలెక్టర్ డా. ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాలకొండ సబ్ కలెక్టర్, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలువల అక్రమ నిర్మాణం వలన నీటి ప్రవాహం ఆటంకం కలుగుతుందన్నారు.