కాంప్లెక్స్ సమావేశంలో ఉపాధ్యాయులకు శిక్షణ
CTR: పుంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశం జరిగింది. ఈ మేరకు విద్యార్థుల ప్రగతి, పరీక్షలలో వచ్చిన గ్రేడులను MEO నటరాజ రెడ్డి సమీక్షించారు. ఈ మేరకు నూతన విద్యా విధానానికి అనుగుణంగా తరగతులలో విద్యార్థులకు బోధనా పద్ధతులు మెలుకువలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.