బోనాల పండగలో పాల్గొన్న ఎమ్మెల్యే

WPN: ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో గురువారం రాత్రి నిర్వహించిన బోనాల పండగలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని సందడి చేసారు. ఈ సందర్బంగా ఆయన పోచమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు చేసారు. అమ్మవారి ఆశీస్సులతో ఖిల్లా ఘణపురం మండలంతో పాటు వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.