VIDEO: జైల్ నుంచి బాల్క సుమన్ విడుదల
MNCL: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట లభించింది. చెన్నూర్‌లో నిరసన చేపట్టిన కేసులోనూ కోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో గత నెల 18 నుంచి ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న సుమన్ నేడు విడుదలయ్యారు. సుమన్‌తో పాటు ఆయన అనుచరులు రాజిరెడ్డి, అనిల్ లక్ష్మీకాంత్ బెయిల్‌పై విడుదలయ్యారు.