సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన నేతలు

WGL: ఏటూరునాగారం, రోహీర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్థానిక కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. సీఎం సహాయనిధి పథకం పేద ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం ఎంతగానో ఉపయోగపడుతుందని నేతలు అన్నారు. మండల అధ్యక్షుడు చిటమట రఘు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకన్న, మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ తదితరులు ఉన్నారు.