ఓయూలో యాక్సిడెంట్.. విద్యార్థి మృతి

ఓయూలో యాక్సిడెంట్.. విద్యార్థి మృతి

HYD: ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికుల వివరాలు.. మాణికేశ్వరనగర్‌లో రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఓ బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సికింద్రాబాద్ బోయగూడకు చెందిన ITI విద్యార్థి అభిషేక్ (18) తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.