వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

HYD: బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ గొప్ప పరిపాలన దక్షత కలిగిన నాయకుడని కొనియాడారు.