B.Ed, B.PEd పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

B.Ed, B.PEd పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో B.Ed 1, 3వ అలాగే B.PEd 1వ సెమిస్టర్ల పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ నేడు ఈ ఫలితాలను విడుదల చేసినట్లు గురువారం తెలిపారు. ఈ ఫలితాలు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించారు.