రేపటి నుంచి సంతాన లక్ష్మీ అమ్మవారి జాతర
VZM: చీపురుపల్లిలోని శ్రీ సంతానలక్ష్మి అమ్మవారి 42వ జాతర మహోత్సవాలు రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను భోగాపురపు వాయునందన శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రతిరోజు విశేష కుంకుమ పూజలు జరుపుతారు. ఈ మేరకు ఆలయం వద్ద ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు ఇవాళ తెలిపారు.