అదుపు తప్పి ధాన్యం లారీ బోల్తా
KMM: ధాన్యం లారీ బోల్తా పడి లారీ క్లీనర్ మృతి చెందిన సంఘటన తల్లాడ మండల పరిధిలోని వెంగన్నపేట గ్రామ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వెంగన్నపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు చేసి లారీలో లోడ్ చేసుకొని రాజమండ్రికి వెళ్తున్న క్రమంలో గూడూరు, మిట్టపల్లి గ్రామ సమీపంలో ఉన్న వంతెన వద్ద లారీ బోల్తా పడింది. దీంతో లారీ క్లీనర్ మడక జోగేశ్వరరావు(38) అక్కడికక్కడే మృతి చెందాడు.