కుల్కచర్ల హత్యపై దర్యాప్తు చేస్తున్నాం: DSP
TG: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల హత్యలపై దర్యాప్తు చేస్తున్నామని DSP శ్రీనివాస్ తెలిపారు. 'గతకొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య పిల్లలతో పాటు వదినను యాదయ్య నరికి చంపాడు. ఆ తర్వాత ఉరేసుకుని యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కూతురిని చంపేందుకు ప్రయత్నించగా గాయాలతో తప్పించుకుంది. ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేశాం' అని పేర్కొన్నారు.