కొండేపి పొగాకు వేలం కేంద్రంలో 354 బేళ్లతిరస్కరణ

ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో శనివారం గరిష్ఠ ధర కేజీకి రూ.330 పలికింది. కనిష్ఠ ధర రూ.110గా నిర్ణయమైంది. పెట్లూరు, జగ్గరాజుపాలెం, వర్ధనయినపాలెం గ్రామాల రైతులు 961 బేళ్లు అమ్మకానికి తీసుకువచ్చారు. వాటిలో 596 బేళ్లు కొనుగోలు చేసిన సమయంలో 354 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. ఎఫ్వన్ గ్రేడ్ పొగాకు ధర పెరుగుతుండగాలో గ్రేడ్ పొగాకు ధర దిగజారుతోంది.