మోడల్ స్కూల్లో దరఖాస్తులకు ఆహ్వానం
KRNL: మంత్రాలయం మండలం రచ్చుమరి మోడల్ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ అశోక్ నాయక్ తెలిపారు. ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థి ఫొటో, SSC హాల్ టికెట్ తదితర పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.